ప్రభాస్
తెలుగు సినిమా నటుడు.
పూర్తి పేరు: ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు.
జననం: 1979 అక్టోబర్ 23.
తల్లి: శివకుమారి.
తండ్రి: సూర్యనారాయణ రాజు.
జననం:
ప్రభాస్ సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23వ తేదీన జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు తన స్వగ్రామం. తన తల్లిదండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు అతనికి ఒక సోదరుడు ప్రబోధ్ ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. ప్రబాస్ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డి.ఎన్.ఆర్ స్కూల్ భీమవరంలో పూర్తి చేశారు. బి.టెక్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీ చైతన్య హైదరాబాదు లో పూర్తి చేశారు.ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత.
సినీ జీవితం:
రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసునిగా సినీ జీవితంలోకి అడుగుపెట్టిన ప్రభాస్. 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ సినీ తెరంగెట్రం చేశాడు. ఈ సినిమా లో నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవి హీరోయిన్ ఈమె కూడా తెలుగులో ఇది తొలి సినిమా. 2003లో రాఘవేంద్ర సినిమా తీశారు. 2004లో త్రిష సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్ కు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఆ తరువాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించారు. ఈ సినిమాల ద్వారా ప్రభాస్ కు నటుడిగా మంచి గుర్తింపు లభించింది. 2005లో ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్,శ్రేయ చత్రపతి సినిమా లో నటించారు. చత్రపతి సినిమా భారీ విజయాన్ని సాధించి ప్రభాస్ ను తెలుగులో ఒక పెద్ద నటుడిగా నిలబెట్టింది. ఆ తరువాత పౌర్ణమి,యోగి, మున్నా సినిమాల్లో నటించాడు. 2008లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో త్రిష సరసన తన కెరియర్ లో రెండోసారి బుజ్జిగాడు సినిమాలో నటించాడు. 2009లో మోహర్ రమేష్ దర్శకత్వంలో అనుష్క, నమితల సరసన బిల్లా సినిమాలో నటించాడు. ఈ సినిమాలో తన పెదనాన్నరెబల్ స్టార్ కృష్ణంరాజు తో కలిపి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ప్రభాస్. తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఏక్ నిరంజన్ సినిమా లో నటించాడు. 2010లో కరుణాకరన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ సరసన డార్లింగ్ సినిమాలో నటించాడు. తొలిసారిగా క్లాస్ రోల్ లో నటించిన ప్రభాస్ మంచి విజయం సొంతం చేసుకున్నారు. 2011లో మళ్లీ కాజల్ అగర్వాల్ తో కలిసి దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించాడు కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ మరో కథానాయక. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. మల్ల 2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తన పెదనాన్న అయినటువంటి కృష్ణంరాజు తో రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో తమన్నా, దీక్షాసేత్ హీరోయిన్లుగా నటించారు. 2013లో రచయిత అయినటువంటి కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాలో నటించారు. ఈ సినిమాలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ కథానాయకులు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ప్రభాస్ ను కొత్తగా చూపించడం జరిగింది.
ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో అనుష్క,రానా దగ్గుబాటి లతో కలిసి బాహుబలి సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది.అందులో మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో భారీ అంచనాలతో జులై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లు వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం 2017 ఏప్రిల్ 28 విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బహుబలి-2 సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే మొదటి 1000 కోట్లు దాటిన చిత్రం గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు సంపాదించారు. ఆ తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రం 2019లో విడుదలైంది. ప్రభాస్ నటించిన రాదే శ్యామ్ విడుదలైంది. ఆ తరువాత ఆది పురుష్ సినిమాలో నటించారు. ప్రస్తుతం సలార్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ K కూడా చివరి దశకు చేరుకుంది.