jr ntr tollywood hero

jr ntr

పూర్తి పేరు: నందమూరి తారక రామారావు.
జననం: 1983 మే 20.
భార్య: లక్ష్మీ ప్రణతి.
తల్లి: షాలిని.
తండ్రి: నందమూరి హరికృష్ణ.
పిల్లలు: అభయ్ రామ్, భార్గవ్ రామ్.

jr ntr family

జననం:

నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) 1983 మే 20 నా జన్మించాడు. తండ్రి నందమూరి హరికృష్ణ తల్లి షాలిని. చిన్నతనంలోనే కూచిపూడి నాట్యం నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు. తనని తారక్ లేదా jrఎన్టీఆర్ గా పిలుస్తూ ఉంటారు. హైదరాబాదులోని విద్యారణ్య ఉన్నత పాఠశాలలో విద్యను పూర్తి చేశాడు. తన తాతగారు అయినటువంటి నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్) తారక్ లోని కళాభిమానానికి ముద్దులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటునిగా హిందీ చిత్ర సేవకు పరిచయం చేశాడు. తరువాత బాల రామాయణంలో చిత్రములో రాముడిగా నటించాడు.ఆ సమయంలో నట శిక్షకుడు ఎం జె బిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.

సినీ ప్రయాణం

 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రంతో ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు. ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం ద్వారా విజయం మంచి పేరు సాధించాడు ఆ చిత్రం విజయవంతం అవడంతో మంచి అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత వచ్చిన సుబ్బు సినిమా పర్వాలేదు అనిపించిన. ఆ తరువాత వి వి వినాయక దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రంలో అతని నటన చూసి ఎంతో మంది అతని అభిమానులుగా మారారు. ఆ తరువాత అల్లరి రాముడు సినిమా యావరేజ్ గా నిలిచింది. మళ్లీ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి చిత్రం విడుదలైంది తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంతో అతను అగ్రనటులలో ఒకనిగా ఎదిగాడు. సింహాద్రి తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆంధ్రావాలా సినిమా రిలీజ్ అయి అంచనాలను అందుకోలేదు తర్వాత సాంబ పర్వాలేదనిపించిన నా అల్లుడు, నరసింహుడు సినిమాలు బాగా నిరాశపరిచాయి. అశోక్, రాఖి చిత్రలు పర్వాలేదు అనిపించిన బాగా లావు అయ్యాడు అన్న విమర్శలు వచ్చాయి. రాఖీ చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 2007లో మరల ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో యముడి పాత్రలో కనిపించి పౌరాణిక పాత్రల లోను రాణించగలరని నిరూపించుకున్నాడు ఎవరు ఊహించని విధంగా సన్నబడి లావు అవుతున్నాడు అన్న విమర్శలు తిప్పి కొట్టాడు. 2008లో మోహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన కంత్రి చిత్రం పరవాలేదు అనిపించింది. 2010లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ మంచి విజయాన్ని సాధించింది. అదే సంవత్సరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం ఆ సంవత్సరపు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 2011లో మోహర్ రమేష్  దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకం పై అశ్వినీ దత్ నిర్మాణంలో శక్తి చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఘోర పరాజయం పాలయింది. 2011లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఊసరవెల్లి మంచి వసూలు సాధించే పర్వాలేదు అనిపించింది ఆ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన దమ్ము చిత్రం అతని నటనకు మరోసారి నిలువుటద్దం గా నిలిచిన ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో BAADSHA
చిత్రం మంచి విజయాన్ని అందుకొని మంచి వసూళ్లు సాధించింది తరువాత వచ్చిన రామయ్య వస్తావయ్యా రభస చిత్రాలు ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి.
2017లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ ఎన్నో ఏళ్లుగా అందరిని ద్రాక్షాల ఉన్న విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో అద్భుత నటన కనబరిచాడు. అంతేకాక జెమిని టీవీ ఛానల్ లో ఈ చిత్రం ప్రసారమై 26.5 టిఆర్పి తో అన్ని రికార్డులు చెరిపివేసింది. జూనియర్ ఎన్టీఆర్ 25వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో 2016 సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని గెటప్ ను కొన్ని లక్షల మంది అనుసరించారు. ఫోబ్స్ మోస్ట్ డిజైనబుల్ మెన్ 2015లో రెండవ స్థానాన్ని సంపాదించాడు. ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. తరువాత కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. 2017లో జై లవ కుశ చిత్రంలో మూడు వివరణమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాని బాబి డైరెక్ట్ చేశారు. ఆ తరువాత బుల్లితెర లో కూడా బిగ్ బాస్ షో ద్వారా తనేంటో నిరూపించుకున్నాడు. వరుస విజయాల మీద ఉన్న తారక్ కి 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో మల్టీస్టారర్ RRR సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటించి తన నటన ఇది అని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించింది.

నటించిన చిత్రాలు

1.నిన్ను చూడాలని
2.స్టూడెంట్ నెం 1
3.సబ్బు
4.ఆది
5.అల్లరి రాముడు
6.నాగ
7.సింహాద్రి
8.ఆంధ్రావాలా
9.సాంబ
10.నా అల్లుడు
11.నరసింహుడు
12.అశోక్
13.రాఖీ
14.యమదొంగ
15.కంత్రి
16.అదుర్స్
17.బృందావనం
18.శక్తి
19.ఊసరవెల్లి
20.దమ్ము
21.బాద్ షా22.రామయ్య వస్తావయ్య
23.రభస
24.టెంపర్
25.నాన్నకు ప్రేమతో
26.జనతా గ్యారేజ్
27.జై లవ కుశ
28.అరవింద సమేత వీర రాఘవ
29.RRR
30.దేవర

Leave a Comment