భగవంత్ కేసరి టాలీవుడ్ సినిమా రివ్యూ:

bagavanth kesari

భగవంత్ కేసరి మూవీ రివ్యూ:
భగవంత్ కేసరి మూవీ బాలకృష్ణ హీరోగా అనిల్  రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ మధ్యకాలంలో వరుసహిట్లు మీద హిట్లు కొడుతూ సూపర్ డూపర్ ఫామ్ తో దూసుకుపోతున్న సీనియర్ స్టార్ హీరో నరసింహ నందమూరి బాలకృష్ణఅఖండ, వీరసింహారెడ్డి చిత్రాలు తర్వాత కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి భగవంత్ కేసరి మూవీతో ముందుకు వస్తున్నారు. ఇదే ఊపులోభగవంత్  కేసరి సినిమాను చేశారు. క్రేజీ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఎన్నో అంచనాల విడుదల కాపోతోంది.ఈ నేపథ్యంలో తాజాగా సినిమా మరి భగవంత్ కేసరిగా బాలకృష్ణ
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రమే భగవంత్ కేసరి ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీ లీల కీలక పాత్ర చేసింది అర్జున్ రాంపాల్ ఇందులో విలన్ గా చేశారు. ఈ చిత్రాన్ని సన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది నిర్మించారు దీనికి S.S తమన్ మ్యూజిక్ ఇచ్చారు.

అఖండ,వీర సింహారెడ్డి సక్సెస్ లతో బాలయ్య కెరియర్ లోనే సూపర్ ఫామ్ లో ఉన్నారు అలాగే టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు.వీరి కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అంతేకాకుండా బాలకృష్ణ తన వయసుకు తగ్గ పాత్ర చేయడం అనిల్ రావిపూడి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ప్రయత్నించడం తో అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

bagavanth kesari

కథ:
నేలకొండ భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ) వరంగల్ జైల్లో ఖైదీ. చావు బ్రతుకుల మధ్య ఉన్న భగవంత్ కేసరి తల్లి చివరి కోరికగా కొడుకును చూడాలని కోరుకుంటుంది. దీంతో జైలు రూల్స్ బ్రేక్ చేసి భగవంత్ కేసరి బయటకు తీసుకువెళ్తాడు జైలర్ శ్రీకాంత్ (శరత్ కుమార్). ఈ కారణం వల్ల శ్రీకాంత్ సస్పెండ్ అవుతాడు కానీ శ్రీకాంత్ వెళ్లే ముందు సత్ప్రవర్తన కారణంగా భగవంత్ కేసరి రిలీజ్ చేస్తాడు జైలు నుంచి విడుదలయ్యాక శ్రీకాంత్ ఇంటికి వస్తాడు భగవంత్ కేసరి. అదే రోజు ఆక్సిడెంట్ అయ్యి శ్రీకాంత్ చనిపోతాడు. శ్రీకాంత్ కూతురైన విజ్జి పాప (శ్రీ లీల) బాధ్యత భగవంత్ కేసరి తీసుకుంటాడు తండ్రి కోరిక మేరకు విజ్జిని ఆర్మీలో జాయిన్ చేయాలని భగవంత్ కేసరి అనుకుంటాడు. కానీ విజ్జికి అది ఇష్టం ఉండదు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి అనుకుంటుంది విజ్జి. మరోవైపు రాహుల్ సంఘీ (అర్జున్ రాంపాల్) దేశంలో ఉన్న అన్ని పోర్ట్లు కలిపే ప్రాజెక్ట్ ని దక్కించుకోవాలని చూస్తూ ఉంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా రాహుల్ సంఘీ దారిలోకి విజ్జి వస్తుంది. అప్పుడు భగవంత్ కేసరి ఏం చేశాడు భగవంత్ కేసరి రాహుల్ సంఘీ ఉన్న పాత వైరం ఏంటి అనేది తెలుసుకోవాలంటే భగవంత్ కేసరిచూడాల్సిందే.

విశ్లేషణ:
నందమూరి బాలకృష్ణ సినిమా చూడటానికి థియేటర్ కి వెళ్తున్నామంటే ఏం ఎక్సపేక్ట్ చేయాలని ఒక ఐడియా ఉంటుంది. అలాగే అనిల్ రావిపూడి సినిమాల నుంచి ఏం కోరుకుంటున్నామో అనే ఐడియా కూడా ఉంటుంది. ఇద్దరు కలిసి చేసిన ప్రయత్నమే భగవంత్ కేసరి ముఖ్యంగా అనిల్ రావుపూడి బలం కామెడీ కానీ తను ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే భగవంత్ కేసరి లో కామెడీ చాలా తక్కువగా ఉంటుంది. అనిల్ రావిపూడి ఎమోషన్స్ యాక్షన్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు అలాగే బాలకృష్ణ సినిమా అంటే పెద్ద పెద్ద డైలాగులతో ఆడియన్స్ కు అలవాటైపోతుంది కానీ భగవంత్ కేసరి పంచ్ డైలాగులు కంటే పంచ్ లు ఎక్కువ వాడుతాడు ఇది సినిమాకు కొత్త ఫ్లేవర్ ను తీసుకువచ్చింది.
భగవంత్ కేసరి సినిమా కథ కొత్తది కాకపోయినా అనిల్ రావిపూడి దానిని నడిపిన విధానం కొత్తగా అనిపిస్తుంది. ఇంట్రడక్షన్ ఫైట్ ఆ తర్వాత శరత్ కుమార్ చిన్నప్పటి విద్య పాప నేపథ్యంలో వచ్చే సీన్లు చాలా సమయం తీసుకుంటాయి విజ్జి భగవంత్ కేసరి మధ్య బలమైన కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలనేది అనిల్ రావిపూడి ఫీలయ్యారు కానీ ఆ సీన్లు కొంచెం లెంత్ అనిపిస్తాయి. అర్జున్ రాంపాల్ పాత్ర పరిచయం చేసే సీన్లు మాత్రం వేగంగా సాగుతాయి. శ్రీ లీల వెంట అర్జున్ రాంపాల్ మనుషులు వెంటపడే సన్నివేశాన్ని డైరెక్టర్ చాలా కన్వీనెంట్గా రాసుకున్నట్లు అనిపిస్తుంది. కానీ కథ వేగం పుంజుకునేది అక్కడి నుంచే ఇంటర్వెల్ వరకు విడివిడిగా సాగిన కథలు ఒకదానితో ఒకటి కలిసేది అక్కడే. బాలకృష్ణ మార్క్ హై వోల్టేజ్ మాస్ యాక్షన్ సీన్ తో ఇంటర్వెల్ బోర్డు పడుతుంది.

భగవంత్ కేసరి రాహుల్ సంఘి ఫ్లాష్ బ్యాక్ తో సెకండాఫ్ ప్రారంభమవుతుంది అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో చెప్పిన సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఇక్కడే రివిల్ అవుతుంది బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ అనిల్ రావిపూడి మార్క్ టైమింగ్ తో ఆ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. కథ హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వగానే హీరో విలన్ మధ్య కాటన్ మౌస్ గేమ్ స్టార్ట్ అవుతుంది కానీ అది ఆగుతూ సాగుతూ ఉంటుంది. ఎమోషన్ యాక్షన్ ఎలివేషన్ మధ్య స్క్రీన్ ప్లే ట్రాక్ లు మారుతున్న ఆగకుండా పరుగులు పెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు పాట నేపథ్యంలో వచ్చే బస్సు యాక్షన్ సీన్ చాలా కొత్తగా ఉంటుంది యాక్షన్ సీన్లు కామిక్ గా చూపిస్తూ ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించారు అనిల్ రావిపూడి స్కూల్ ఫంక్షన్ లో బాలకృష్ణ స్పీచ్ ఎంటర్టైన్మెంట్గా ఇన్ఫర్మేషన్ అవేర్నేస్ ను అందిస్తుంది. ప్రీ క్లైమాక్స్ కు చేరుకునేసరికి కథ పూర్తిగా యాక్షన్ టర్న్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది ఆ సర్ప్రైజ్ సినిమాను రెగ్యులర్ బాలకృష్ణ సినిమాల నుంచి ఈ సినిమాను ప్రత్యేకంగా చూపిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎస్ ఎస్ తమన్ పాటలు స్క్రీన్ పై కూడా ఆకట్టుకుంటాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతం గా ఉంటుంది. సినిమా మాత్రం చాలా రుచిగా ఉంది. సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కథ మూడుకు తగ్గట్లు సాగుతుంది. కొన్ని సీన్లలో లైటింగ్ ను బాగా ఉపయోగించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికి వస్తే….
బాలకృష్ణ సెటిల్డ్ పర్ఫామెన్స్ చేయడం కొంచెం కొత్తగా ఉంటుంది బాలయ్య మార్కు సీన్లు కూడా లౌడ్ గా లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సినిమా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ శ్రీలీల కే భగవంత్ కేసరి తరువాత టాలీవుడ్ తనను మరింత కొత్తగా చూసే ఛాన్స్ ఉంది ఎమోషనల్ సీన్లలో బాగా నటించింది. హీరోయిన్ ఉండాలి కాబట్టి కాజల్ అగర్వాల్ పాత్ర పెట్టినట్లు ఉంటుంది తన పాత్రను తీసేసి చూసిన కథలో పెద్ద తేడా కనిపించదు. అర్జున్ రాంపాల్ వెళ్లనిజం తన పాత్ర మేర తను బాగా నటించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు

ఓవరాల్ గా చెప్పాలంటే…….
బాలకృష్ణను కొత్తగా చూపిస్తూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసిన అనిల్ రావిపూడి అందులో సక్సెస్ అయ్యారు. ప్యాన్స్ కు మాత్రం బాగా నచ్చుతుంది సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్ కు వెళ్లి ఒక కొత్త బాలయ్యను చూసిన అనుభూతి పొందవచ్చు.

2 thoughts on “ Bhagavanth Kesari Tollywood Movie Review in Telugu”

Leave a Comment