Ram Charan Tej Tollywood Hero
పూర్తి పేరు: రామ్ చరణ్ తేజ్
జననం: 1985 మార్చి 27
భార్య: ఉపాసన
తల్లి: సురేఖ
తండ్రి: చిరంజీవి
పిల్లలు: క్లింకారా
రామ్ చరణ్ తేజ్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు
జననం:
రామ్ చరణ్ తేజ్ మార్చి 27, 1985 న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు.రామ్ చరణ్ తేజ్ కి ఇద్దరు సొదరీమణులు శ్రీజ మరియూ సుష్మిత. జూన్ 14, 2012న ఉపాసన ని వివాహమ్ చేసుకున్నాడు.
సినీ ప్రయాణం:
చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత చిత్రం తో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు. 2010లో భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ చిత్రంలో చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రంలో నటించాడు.ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో నాయక్ చిత్రంలో నటించాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో (అల్లు అర్జున్) తో కలిసి ఎవడు చిత్రంలో నటించాడు. తరువాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాన్ చిత్రంలో నటించాడు. ఇది ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే నటించాడు.2015 లో శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీలో నటించాడు అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.2016 లో వచ్చిన ధృవ చిత్రం తో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు.2018 లో వచ్చిన రంగస్థలం చిత్రం విజయం తో పాటు ఎన్నో రికార్డులు తిరగరాసింది.
రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా (రౌద్రం రణం రుధిరం) హీరోగా రామ్ చరణ్‌కు పుట్టినరోజు మందు రాజమౌళి మంచి కానుక ఇచ్చారనే చెప్పాలి. ఈ సినిమా అన్ని రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. అంతేకాదు తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 235 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి భారతీయ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచనాలకు వేదికగా నిలిచింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, అజయ్ దేవ్‌గణ్‌లతో చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.