Karthi's Japan Movie Review
యువ నటుడు కార్తీ హీరోగా అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మాస్ మూవీ జపాన్. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్ ఆర్ ప్రభు నిర్మించగా జివి ప్రకాష్ కుమారన్ సంగీతం అందిస్తున్నారు.
జపాన్ మూవీని దర్శకుడు రాజ్ మురుగన్ అద్భుతంగా తీశాడు. పస్ట్ ఆఫ్ యావరేజ్ గా, సెకండ్ ఆఫ్ సూపర్ గా ఉంది. కార్తీ తన పాత్రలో ఒదిగిపోయాడు. జీవి ప్రకాష్ సంగీతం సినిమాకే హైలెట్. సినిమాటోగ్రఫీ అదరగొట్టింది.
జపాన్ సినిమా ఎలా ఉంది అంటే?
కథ:
హైద్రాబాద్‌లోని రాయల్ అనే అతి పెద్ద నగల షాపులో దొంగతనం జరుగుతుంది. రెండు వందల కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్తారు. అది జపాన్ చేశాడని పోలీసులు గుర్తిస్తారు. ఇక జపాన్ కోసం పోలీసులు వెతుకుతుంటారు. అప్పటికే దేశంలో జపాన్ మీద మోస్ట్ వాంటెడ్ అనే ముద్ర ఉంటుంది. కేరళ, కర్ణాటక ఇలా అన్ని రాష్ట్రాల పోలీసులు జపాన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ జపాన్‌కు అనుకూలంగా ఒక్క సాక్ష్యం కూడా దొరకదు. మామూలుగానే జపాన్‌కు బంగారం పిచ్చి తెరపై తనని తాను హీరోగా చూసుకోవాలనే పిచ్చితో ఉంటాడు. అందుకే తనకు ఇష్టమైన సంజు ను హీరోయిన్గా పెట్టి సినిమా తీసి గోల్డెన్ స్టార్ అవుతాడు జపాన్. రెండు వందల కోట్ల రాబరీ కేసులో జపాన్ ఎలా చిక్కుకుంటారు? ఆ దొంగ తనం చేసింది ఎవరు? చివరకు జపాన్ ఏమవుతాడు? అసలు జపాన్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? దొంగగా ఎందుకు మారతాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.
కార్తీ ఈ చిత్రాన్ని ఒక్కడే తన భుజాన మోసినట్టుగా అనిపిస్తుంది. సునీల్ పాత్ర కొన్ని సార్లు సీరియస్‌గా అనిపిస్తుంది. ఇంకొన్ని సార్లు కామెడీగా కనిపిస్తుంది. అను ఇమాన్యుయేల్ పాత్రకు ఇంపార్టెన్స్ లేదనిపిస్తుంది. కనిపించేది కూడా కొద్ది సేపే. కేఎస్ రవికుమార్, రాజేష్ అగర్వాల్ ఇలా మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి.సాంకేతికంగా చూస్తే.. మాటలు కొన్ని చోట్ల నవ్విస్తాయి. ఇంకొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. పాటలు ఏమంత ప్రభావాన్ని చూపించవు. విజువల్స్ బాగుంటాయి. ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడం వల్లే నిడివి కూడా సమస్యగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి.
చివరిగా: జపాన్ మూవీ అభిమానులకు పర్వాలేదు అనిపిస్తుంది.