Mahesh Babu New Movie

జక్కన్న ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా పనిలో నిమగ్నం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేశ్ గుంటూరు కారం సినిమాతో బిజి బిజిగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అతడు, ఖలేజా సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.#filmyjanata
రాజమౌళి,మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా ఫ్యాన్సులో ఆందోళన?
గుంటూరు కారం సినిమా తర్వాత మహేశ్ బాబు(#filmyjanata) రాజమౌళి సినిమాపై దృష్టి పెట్టనున్నారు. ఇక ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు కూడా కంప్లీట్ చేశారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. రాజమౌళి, మహేశ్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందట. ఈ సినిమాను రెండు భాగాలుగా రాజమౌళి తెరకెక్కించనున్నట్లు ఓ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.#filmyjanata
ఈ సినిమా అడ్వంచర్ జోన్ లో ఉంటుందని చెప్పుకువచ్చారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో, ఇండియానా జోనస్ లాంటి బ్యాక్ డ్రాప్ తో హాలీవుడ్ రేంజులో ఉంటుందని వెల్లడించారు.వచ్చే ఏడాది ప్రారంభంలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ సినిమాకు రెండో పార్ట్ కూడా తెరకెక్కించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు.#filmyjanata
మహేశ్ సినిమాను కూడా రెండు పార్ట్స్ అంటే మహేశ్ ఫ్యాన్స్ మాత్రం బయడపడుతున్నారు.జక్కన్న ఒక్క సినిమా తీసేందుకే 3 ఏళ్లు తీసుకుంటారు.. మరి మహేశ్ తో రెండు సినిమాలు అంటే(#filmyjanata) ఎన్ని ఏళ్లు తీసుకుంటాడో అని తెగ ఆందోళన చెందుతున్నారు.