Jr NTR DEVARA PART-1

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. దేవర సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ లో ఓల్డ్ లుక్ లో కనిపిస్తారని,అది ఫ్లాష్ బ్యాక్ కి లీడ్ రోల్ అని తెలుస్తోంది. హీరో శ్రీకాంత్ పాత్ర పరిధిలో వచ్చే ఈ ట్విస్ట్ గొప్ప థ్రిల్లింగ్ గా ఉంటుందని పైగా ఈ ట్విస్ట్ ఎవ్వరు ఊహించని విధంగా ఉంటుందని మరియు ఈ పాత్రలో ఎన్టీఆర్ సరికొత్త వేరియేషన్స్ చూపిస్తారని తెలుస్తోంది.#filmy janata
దేవర సినిమాను దాదాపుగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నరు. ఇంతకుముందు ఎన్టీఆర్ కొరటాల కలయికలో జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే మరల ఇదే కలయికలో వస్తున్న దేవర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వేచి చూడాల్సిందే. అందులోనూ ఈ సినిమా రెండు పార్టీలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.#filmy janata