ALLU ARJUN TOIIYWOOD HERO

పూర్తి పేరు: అల్లు అర్జున్
జననం: 1982 ఏప్రిల్ 8
భార్య: స్నేహ రెడ్డి
తల్లి: నిర్మల
తండ్రి: అరవింద్
పిల్లలు: అయాన్, అర్హ

జననం:
అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతులకు రెండవ కుమారునిగాచెన్నైలో జన్మించాడు. అతని పెద్దన్నయ్య వెంకటేష్ (బాబీ), తమ్ముడు అల్లు శిరీష్. చెన్నైలోని పద్మ శేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళినపుడు అందులో బాలనటుడి పాత్రలో మొదటి సారిగా నటించాడు. పాఠశాలలో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు.
సినీ జీవితం:
అల్లు అర్జున్ మొదటి చిరంజీవి డాడీ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి ఆకర్షించాడు. తరువాత చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి లో నటించాడు. హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా, తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి అల్లుడుగా అల్లు అర్జున్ సినిమా పరిశ్రమ లోకి రావడం తేలికగానే జరిగింది. కానీ దానిని సద్వినియోగం చేసుకొని తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు. గంగోత్రి తరువాత ఓ వైవిధ్యమైన పాత్రలో ఆర్యగా యువత మనసులో స్థానం సంపాదించాడు. ఆర్యతో తెలుగులోనే కాకుండా మలయాళ కన్నడ అభిమానుల ప్రశంసలు పొందాడు. ఇప్పటికి మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అయ్యి విడుదల అవుతుండటం విశేషం. ఆ తర్వాత రిలీజ్ అయిన బన్నీ విజయంతో హ్యాట్రిక్ పూర్తి చేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అక్కడ నుంచి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తూ నటనలో ఇమేజ్తో డ్యాన్స్ లో స్టైల్ తో ప్రేక్షకుల అభిమానం కొల్లగొట్టాడు. పరుగు లో కృష్ణగా చక్కని నటనతో ఆకట్టుకొని వేదం తో నవతరం నాయకులలో మల్టీస్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు. అంతేకాకుండా 6 ప్యాక్ బాడీ కల్చర్ ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత అల్లు అర్జున్ ది.