Jr NTR Devara-1 Telugu Movie Trailer

నటీనటులు: Jr NTR, Jahnavi, Saif Ali Khan, Prakash Raj తదితరులు నటిస్తున్నారు.
దర్శకుడు: కొరటాల శివ
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
నిర్మాత: కొసరాజు హరికృష్ణ,సుధాకర్ మిక్కిలినేని
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
#filmyjanata.com
Devara-1 Tollywood Movie Teaser
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR తరువాత చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాను డైరెక్టర్ కొరటాల శివ తీస్తున్నాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవర సినిమాకు సంగీతం అనిరుద్ రవిచందర్ అందిస్తున్నాడు. దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా జాహ్నవి కపూర్ నటిస్తుంది. అత్త పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది అని టాక్ . అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. దేవర చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో Jr NTR కనిపించబోతున్నారని టాక్.
ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నారు అని డైరెక్టర్ కొరటాల శివ మీడియా సమావేశంలో తెలిపారు. దేవర మొదటి భాగం 2024 ఏప్రిల్ 5 రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దేవర సినిమా కొత్తగా ఉంటుందని చాలా బలమైన పాత్రలు ఉంటాయని అందుకే కథ ఒక భాగంలో పూర్తి అవదు అనే ఉద్దేశంలో రెండు భాగాలుగా విభజించారు. ముఖ్యంగా దేవర పార్ట్ వన్ టీజర్ ను సలార్ మరియు డుంకి సినిమా థియేటర్లలో విడుదల చేయాలని దానికి సంబంధించిన టీజర్ రెడీగా ఉన్నట్లు టాక్ మరి ఎంతమంది దేవర టీజర్ కోసం రెడీగా ఉండండి