Superstar Mahesh Babu's Guntur Kaaram first single

Guntur Kaaram is written and directed by Trivikram Srinivas, and produced by S. Radha Krishna through Haarika & Hassine Creations.The movie casts Mahesh Babu, Jayaram, Sreeleela, Meenakshi Chaudhary, Jagapathi Babu, and Ramya Krishna
‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సాంగ్ కోసం మహేష్ అభిమానులు ఎప్పటి నుంచో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ బర్త్ డే… నవంబర్ 7కు సాంగ్ ప్రోమో లేదా సాంగ్ విడుదల తేదీ ప్రకటిస్తారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే… ఇంతలో సోషల్ మీడియాలో ఓ సాంగ్ చక్కర్లు కొట్టడం మొదలు పెట్టింది.
సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ ‘గుంటూరు కారం’లో ఓ సాంగ్ పాడారు. అదే ‘మసాలా బిర్యానీ’. ఆ సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అయితే ‘గుంటూరు కారం’ నుంచి విడుదల అయ్యే ఫస్ట్ సాంగ్ ఇది కాదని సమాచారం. తొలుత ఈ పాటను విడుదల చేయాలని ప్లాన్ చేసినా… ఎందుకో విరమించుకున్నారట! ఇప్పుడు మెలోడీ సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేస్తారని టాక్. లీకైన ‘మసాలా బిర్యానీ’ తర్వాత వస్తుందని చెబుతున్నారు.