leo telugu movie review

నటీనటులు:విజయ్,త్రిష, సంజయ్ దత్, అర్జున్.
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్.
నిర్మాణం: ఎస్ ఎస్ లలిత్ కుమార్,జగదీష్ పలని స్వామి.
రచన: లోకేష్ కనగరాజ్, రత్నకుమార్,ధీరజ్ వైద్య.
సంగీతం: అనిరుద్ రవిచందర్.
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస.
కూర్పు: ఫిలోమిన్ రాజ్.
విడుదల తేదీ: అక్టోబర్ 19 2023.
దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం లియో పక్క యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ:
పార్తిబన్ (విజయ్) తన భార్య సత్య (త్రిష) తో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. తన ఫ్యామిలీ అలాగే తను నడిపే కాఫీ షాప్ తప్ప పార్తిబన్ కి మరో లోకం తెలియదు. అలాంటి పార్తిబన్ కి గతంలో ఘోరమైన నేర చరిత్ర ఉందని అతను లియో దాస్(విజయ్) అని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) తన గ్యాంగ్ తో వస్తాడు. ఇంతకీ ఈ ఆంటోనీ దాస్ ఎవరు? అతనికి పార్తీ బన్ కి ఉన్న సంబంధం ఏమిటి అసలు లియో ఎవరు ఈ లియో ఎందుకు పార్టీ మనలాగే ఉన్నాడు చివరకు పార్తి బన్ తనను తన ఫ్యామిలీని ఎలా సేవ్ చేసుకున్నాడు. అలాగే పార్తి బన్, లియో ఒకటేనా కాదా? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:
విజయ్ తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు 2 వేరియేషన్స్ లో బాగా మెప్పించాడు ముఖ్యంగా తన బాడీ లాంగ్ వేస్తూ యాక్షన్ సీన్స్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. సంజయ్ దత్ కూడా తన నటనతో కాకుండా తన లుక్స్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. ఇక సినిమా ఎండ్ లో కీలకమైన పాత్రలో కనిపించిన హీరో అర్జున్ వైల్డ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ యాక్టింగ్ పరంగా ముందు చిత్రాల కంటే ఈ చిత్రంలో చాలా బాగా నటించారు. హీరోయిన్ గా త్రిష తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. మన్సుర్ ఆలి ఖాన్ మరియు మిస్కిన్ అలాగే మిగిలిన నటి నటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు లోకేష్ కనకరాజు రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా విజయ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
మైనస్ పాయింట్స్:
లియో పాత్రను ఆ పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ అంతే స్థాయిలో లియో సినిమా కథనం ను రాసుకోలేదు. చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడ కొత్తదనం ఫస్టాఫ్ ను వేగంగా నడిపిన సెకండాఫ్ మాత్రం మరీ సాగదీతగా ఉంటుంది. ఒక క్లైమాక్స్ లో తప్ప కథనంలో ఉత్సాహం పెంచడంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆయన మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు ఇక కథను మలుపు తిప్పే ప్రధాన పాత్రలు ఆయన సంజయ్ దత్, అర్జున్ పాత్రలను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి అంతే ఎఫెక్టివ్ గా ముగింపు ఇవ్వాల్సింది. లియో సినిమాలో బలమైన ఎమోషన్ ఉన్నప్పటికీ ప్రేక్షకుల్ని నిరాశపరిచడు.
సాంకేతిక విభాగం:
దర్శకుడు లోకేష్ కనగరాజ్ కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన లియో కథ కథనాలు రాసుకోలేక పోయారు. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది పాటలు పరవాలేదు అనిపించాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ కొన్ని సాగదీత సీన్స్ తగ్గిస్తే బాగుండేది. నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
మొత్తంగా లియో అంటూ భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో విజయ్ నటన మరియు యాక్షన్ సీన్స్ క్లైమాక్స్ బాగున్నాయి అయితే సినిమాలో బలమైన ఎమోషన్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్ ను ప్రేక్షకులు లీనం అయ్యేలా తీసుకు వెళ్ళలేక పోయారు.సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్ గా విజయభిమానులకు పండగ లాంటి సినిమా.