super star mahesh babu
మహేష్ బాబు తెలుగు సినీ నటుడు.
పూర్తి పేరు: ఘట్టమనేని మహేష్ బాబు.
జననం: ఆగస్టు 9 1974.
తండ్రి: కీ.శే. ఘట్టమనేని శివరామకృష్ణ (కృష్ణ).
తల్లి: కీ.శే. ఇందిరా దేవి.
జీవిత బాగస్వామి: నమ్రత శిరోద్కర్.
పిల్లలు: గౌతమ్ కృష్ణ /సితార.
జననం:
మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ, శ్రీమతి ఇందిరా దేవి గారికి మద్రాసులో జన్మించారు. మహేష్ బాబు చదువు మద్రాసులో పూర్తి చేశారు. ప్రాథమిక విద్య సెయింట్ బెడే స్కూల్ లో కొనసాగించగా, లయోలా కాలేజీ నుండి కామర్స్ లో పట్టా తీసుకున్నాడు. చిన్నతనంలోనే నటనలో ఓనమాలు దిద్దిన మహేష్ బాబు 5 సంవత్సరాల వయసులోనే నీడ (1979) చిత్రంతో తెరంగేట్రం చేశాడు. బాల్య నటుడిగా తన తండ్రి తో పాటు ఏడు చిత్రాలు నటించాడు . బాలచంద్రుడు(1991) సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు.చిన్న వయసులోనే ముచ్చటైన డైలాగులతో డాన్సులతో అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ చదువు పూర్తి చేసే ఉద్దేశంతో నటనకు బ్రేక్ వేశాడు.