Nandamuri Balakrishna Biography

nandamuri balakrishna


పూర్తి పేరు: నందమూరి బాలకృష్ణ
జననం: 10 జూన్ 1960
తల్లి:బసవతారకం
తండ్రి: నందమూరి తారక రామారావు
భార్య : వసుంధర దేవి
పిల్లలు: బ్రాహ్మణి, తేజస్విని,మోక్షజ్ఞ
చదువు: నిజాం కాలేజ్ హైదరాబాద్
వృత్తి: నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త
అన్నదమ్ములు: హరికృష్ణ రామకృష్ణ జయకృష్ణ మోహనకృష్ణ సాయి కృష్ణ జయ శంకర కృష్ణ
అక్క చెల్లెల్లు: పురందేశ్వరి భువనేశ్వరి లోకేశ్వరి ఉమామహేశ్వరి
బంధువులు: నారా చంద్రబాబు (బావమరిది),నారా లోకేష్ (అల్లుడు)

బాల్యం:
బాలకృష్ణ బాల్యం హైదరాబాదులో గడిచింది. ఇంటర్మీడియట్, డిగ్రీ నిజాం కళాశాలలో డిగ్రీ చదివాడు.చదువు పూర్తయిన వెంటనే నటుడు కావాలని కోరుకున్నాడు.

కెరీర్:
బాలకృష్ణ పద్నాలుగేళ్ళ వయసులో తండ్రి ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల (1974) చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయనటుడిగా కనిపించాడు. తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. కథానాయకుడు కాకముందు బాలకృష్ణ నటించిన తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించాడు. 2021 లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ వారి కలయికలో మూడవ సినిమా ఎన్టీ రామారావు గారి 12 మంది సంతానంలో బాలకృష్ణ ఆరవ కుమారుడు‌‌ చిన్నతనంలోనే సినిమాలలోకి ప్రవేశించిన బాలకృష్ణ ఇప్పటికీ వంద కన్నా ఎక్కువ సినిమాల్లో నటించారు. 16 సంవత్సరాల వయసులో అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాలో నటించారు. 1984లో సాహసమే జీవితం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా నటించడం జరిగింది. బాలకృష్ణ తన కెరీర్ ప్రారంభంలో నటించినా సినిమాలలో సాహసమే జీవితం జననీ జన్మభూమి మంగమ్మగారి మనవడు అపూర్వ సహోదరుడు మువ్వగోపాలుడు ముద్దుల మామయ్య సినిమాలు విజయవంతమయ్యాయి. తెలుగులో మొట్టమొదటి సారిగా తీసిన సైపై సినిమా ఆదిత్య 36 9 లో బాలకృష్ణ పాత్రను మరియు కథను చాలామంది మెచ్చుకున్నారు. రాబోయే కాలంలో జరిగే మార్పులను చాలావరకు ఆ రోజుల్లోనే అంచనా వేశారని చెప్పవచ్చు. 2019 వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలలో తన తండ్రి పాత్రను పోషించాడు.

Leave a Comment