NBK109 LETEST NEWS

NBK109

త్రిపాత్రాభినయంలో బాలకృష్ణ

త్రిపాత్రాభినయంలో బాలకృష్ణ ఈ ఏడాది సూపర్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు  హీరో బాలకృష్ణ. వీరసింహా రెడ్డి, భగవంత్‌ కేసరి చిత్రాలు సాధించిన విజయాలతో మంచి జోష్‌మీదున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తన 109వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. మూడు వేర్వేరు కాలాల్లో, విభిన్నమైన గెటప్స్‌లో ఆయన కనిపిస్తారని సమాచారం. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది  ప్రేక్షకుల ముందుకురానుంది.

Leave a Comment