power star pawan kalyan

pawan kalyan

పవన్ కళ్యాణ్ సినీ నటుడు, రాజకీయ నాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు.

పూర్తి పేరు: కొణిదల కళ్యాణ్ బాబు.
జననం: 1968 సెప్టెంబర్ 2.
జీవిత భాగస్వామి: నందిని, రేణు దేశాయ్, అన్నా లేజినోవా.
తండ్రి: కొణిదల వెంకటరావు.
తల్లి: అంజనా దేవి.
సంతానం: అకిరా నందన్, ఆద్య, మార్క్ శంకర్ పవనో విచ్, పొలెనా అంజనా పవనోవా.

జననం:
పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2న కొణిదల వెంకటరావు, అంజనా దేవి దంపతులకు మూడవ కుమారునిగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి పవన్ కు పెద్దన్నయ్య. నటుడు నిర్మాత కొణిదల నాగేంద్రబాబు పవన్ కు రెండవ అన్నయ్య. సినీ పరిశ్రమలోని అతని పెద్దన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు అతను తన పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలోని ఒక దానిలో పవన్ పురస్కారాన్ని అందుకున్నాడు. అతనికి కరాటే లో బ్లాక్ బెల్ట్ ఉంది.

సినీ జీవితం:
పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో తొలిసారిగా నటించాడు. అతని రెండవ చిత్రం గోకులంలో సీత తర్వాత సంవత్సరం విడుదలైంది. తరువాత ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించిన తొలిప్రేమ చిత్రంలో కనిపించాడు. ఇది ఆ సంవత్సరం జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డు గెలుచుకుంది తొలిప్రేమ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో నటించారు. తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రి సినిమాలో నటించారు. 2001లో ఖుషి చిత్రంలో నటించాడు ఇది ఆ సంవత్సరం భారీ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. తరువాత అతను జాని సినిమా స్వయంగా రచించి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పవన్ రెండో భార్య అయినటువంటి రేణు దేశాయ్ అతనితో కలిసి నటించింది. 2004లో గుడుంబా శంకర్ విడుదలైంది. ఈ సినిమాకి స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్ రాశాడు. ఆ తరువాత 2005లో బాలు సినిమాలో నటించారు. తొలిప్రేమ తర్వాత కరుణాకరన్ ఈ సినిమాకి మరల దర్శకత్వం వహించారు. 2006లో తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో బంగారం చిత్రంలో నటించాడు. ఆ తరువాత భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన అన్నవరంలో నటించాడు. 2008లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జల్సా సినిమా లో నటించారు. తరువాత 2010 లో పులి సినిమా రిలీజ్ అయింది. 2011 లో తీన్మార్ సినిమాలో నటించారు. తరువాత విష్ణువర్ధన్ దర్శకత్వంలో పంజా సినిమాలో నటించాడు. 2012లో హరి శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ సినిమాలో నటించారు ఈ సినిమా అత్యధిక వసూలు సాధించిన రెండవ తెలుగు చిత్రంగా నిలిచింది. తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వం లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో నటించాడు. 2013లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది లో నటించాడు. ఈ సినిమా విడుదలకు ముందే సగం సినిమా ఇంటర్నెట్లో లీక్ అవ్వడం వంటి సమస్యలు ఎదుర్కొని 2013లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2014లో స్టార్ ఇండియా సర్వే పవన్ కళ్యాణ్ ను భారతదేశంలో టాప్ ఫైవ్ హీరోల్లో ఒకరిగా పేర్కొంది. 2017లో ఓ మై గాడ్ రీమేక్ అయిన గోపాల గోపాల లో నటించాడు. ఇందులో వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. 2016లో బాబీ దర్శకత్వంలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించాడు. 2017లో కాటమరాయుడు సినిమాలో నటించాడు. మరల తిరిగి 2018 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో నటించాడు ఇది పవన్ కళ్యాణ్ 25వ చిత్రం. 2021 లో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సబ్ లో నటించాడు. తరువాత తన మేనల్లుడు అయినటువంటి సాయిధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమాలో నటించాడు. ఈ సినిమాని సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. హరిష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా నటిస్తున్నాడు. కొత్త చిత్రం ఓ జి సినిమాతో సుజిత్ తో నటిస్తున్నడు ఈ మూడు సినిమాలు వర్కింగ్ లో ఉన్నాయి.

Leave a Comment