Salaar Telugu Movie Review

salaar prabhas

Release date: 22 December 2023 (India)
Director: Prashanth Neel
Budget: 400 crores INR
Cinematography: Bhuvan Gowda
Edited by: Ujwal Kulkarni
Music by: Ravi Basrur

ఆదిపురుష్ తర్వాత ఈ ఏడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం Salaar teaser విడుదలైంది. నీల్‌తో ప్రభాస్ జతకట్టడం అభిమానులలో మరియు సినీ అభిమానులలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల డిసెంబర్ 22కి వాయిదా పడింది.#filmyjanata.com


సాలార్ షూటింగ్ 114 రోజుల పాటు సాగిందని ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ స్థాయి చలనచిత్రం కోసం, ఇది తక్కువగా ఉంటుంది మరియు బృందం సమర్ధవంతంగా ప్లాన్ చేయడం వల్ల నిర్మాణం త్వరగా పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ సమయం వెచ్చించారు. ఎక్కువ భాగం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిందని నీల్ వెల్లడించాడు.

సలార్-1 మూవీ రివ్యూ:

నటీనటులు: ప్రభాస్- పృథ్వీరాజ్ సుకుమారన్- శృతిహాసన్- జగపతిబాబు- ఈశ్వరీ రావు- శ్రియా రెడ్డి-బాబి సింహ- గరుడ రామ్- జాన్ విజయ్- మైమ్ గోపి- సంపత్ రాజ్- ఝాన్సీ తదితరులు

సంగీతం: రవి బస్రుర్

ఛాయాగ్రహణం: భువన్ గౌడ

నిర్మాతలు: విజయ్ కిరగంందూర్- కార్తీక్ గౌడ

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: ప్రశాంత్ నీల్

బాహుబలితో హీరోగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నహీరో
ప్రభాస్ KGF సిరీస్ తో పేరు సంపాదించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా సలార్. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

దేవా (ప్రభాస్) ఒరిస్సాలోని ఒక చిన్న గ్రామంలో అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మెకానిక్ గా పని చేస్తున్న అతన్ని ఒక హింసాత్మక గతం వెంటాడుతూ ఉంటుంది. తల్లి మాట మేరకు అతను హింసకు పూర్తిగా సాధారణ జీవితం గడుపుతుంటాడు. అలాంటి అతను అమెరికా నుంచి వచ్చి శత్రువులకు టార్గెట్ గా మారిన ఆద్య (శృతిహాసన్)ను కాపాడాల్సిన బాధ్యత తీసుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలోనే దేవా అత్యంత భయంకరమైన ఖాన్సార్ నేర సామ్రాజ్యానికి ఎదురు వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ ఆ సామ్రాజ్యం నేపథ్యం ఏంటి…?దానితో దేవా కి వున్న సంబంధమేంటి…? దేవా గతం ఏంటి…? ఆద్యను కాపాడే క్రమంలో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.

సాంకేతిక వర్గం:
మ్యూజిక్ డైరెక్టర్ KGF స్టైల్ మ్యూజిక్ ఇందులోనూ కొనసాగించాడు. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సలార్ సినిమానే ఒక రేంజ్ కి తీసుకెళ్లారు. యాక్షన్ బ్లాక్స్ ఎలివేషన్ సీన్లు ఆర్ఆర్తో బాగా హైలైట్ గా లేపారు. భువన్ గౌడ చాయాగ్రహణం తనదైన శైలిలో సాగింది. విజువల్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ కట్టాలని అతను అత్యద్భుతంగా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా చాలా రిచ్ గా అనిపించింది. దర్శకుడు ప్రశాంత్ నిల్ విషయానికి వస్తే అతను కే జి ఎఫ్ లాగే మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించి తన మార్కు ఎలివేషన్లతో సలార్ సినిమాలో నడిపించారు. ఫస్టాఫ్ యాక్షన్ సీనులతో సెంటిమెంట్తో ఎక్కడ తగ్గకుండా ముందుకు తీసుకెళ్లాడు. సెకండ్ హాఫ్ పార్ట్ టు స్టొరీ కోసం చెప్పే విధానంలో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అయితే ఎలివేషన్ సీన్లు యాక్షన్ కట్టాలు తీయడంలో ప్రశాంత్ నిల్ క్యు తిరుగులేదు అని మరోసారి తెలియపరిచాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభాస్ కటౌట్ ప్రశాంతి ఒక రేంజ్ లో వాడుకున్నాడని చెప్పాలి. ప్రశాంత్ నిల్ తన హిట్ పరంపరను కొనసాగించాడు అని చెప్పాలి.

నటీనటుల విషయానికొస్తే ప్రభాస్ తన నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.యాక్షన్ సీన్స్ సెంటిమెంట్ ఆల్ ఓవర్ ఎక్సలెంట్ గా నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ తక్కువ సమయం కనపడిన స్టోరీ నీ ముందుకు తీసుకెళ్లే పాత్రగా నటించారు మిగతా పాత్రలు తమ పరిధి మేరకు నటించారు.

చివరిగా సలార్ సినిమా ప్రభాస్ అభిమానులకు మరియు యాక్షన్ ప్రియులకు పండగ లాంటి సినిమా.

Filmyjanata సలార్ మూవీ రేటింగ్ 3.5/5

Leave a Comment