HAPPY BIRTHDAY S.S.RAJAMOULI

ఎస్ ఎస్ రాజమౌళి ప్రముఖ దర్శకుడు,నిర్మాత.
పూర్తి పేరు: కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి.
జననం: అక్టోబర్ 10 1973.
తల్లి: రాజనందిని
తండ్రి: K.v విజయేంద్ర ప్రసాద్.
జీవిత భాగస్వామి: రమా రాజమౌళి.
పిల్లలు: కార్తికేయ/మయూశ.
ఎస్ ఎస్ రాజమౌళి తెలుగు సినిమా దర్శకునిగా పనిచేస్తున్నారు.
జననం: తెలుగు సినీ కదా రచయిత కె.వి విజయేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతులకు 1973లో కర్ణాటక రాష్ట్రంలో, రాయచూరు జిల్లా, అమరేశ్వరి క్యాంప్ లో రాజమౌళి జన్మించాడు. వీరి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, కొవ్వూరు గ్రామం. విద్యాభ్యాసం కొవ్వూరు, ఏలూరు, విశాఖపట్నంలలో జరిగింది.
సినీ ప్రయాణం:
కె రాఘవేంద్రరావు మార్గ దర్శకత్వంలో రాజమౌళి ఈటీవీలో తెలుగు సోప్ ఉపేరాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించాడు. తరువాత రాజమౌళి, కే రాఘవేంద్రరావు నిర్మించిన శాంతి నివాసం అనే టీవీ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. ఆ తరువాత 2001లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన స్టూడెంట్ నెంబర్-1 తన మొదటి సినిమా. రాజమౌళి నుండి రెండో సినిమా రావడానికి మళ్ళా రెండు సంవత్సరాలు పట్టింది అది కూడా జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన సింహాద్రి తరువాత సై, చత్రపతి, విక్రమార్కుడు,యమదొంగ, మగధీర,మర్యాద రామన్న,ఈగ,బాహుబలి-1, బాహుబలి-2,RRR వరకు అన్ని విజయవంతమైన చిత్రాలు తీశాడు.

- Student No. 1 (2001)
- Simhadri (2003)
- Sye (2004)
- Chatrapathi (2005)
- Vikramarkudu (2006)
- Yamadonga (2007)
- Magadheera (2009)
- Maryada Ramanna (2010)
- Eega (2012)
- Baahubali: The Beginning (2015)
- Baahubali: The Conclusion (2017)
- RRR (2022)