Tiger Nageswara rao

raviteja tiger nageswara rao

నటీనటులు: రవితేజ,నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్ తదితరులు.

దర్శకత్వం: వంశీకృష్ణ నాయుడు.
నిర్మాత: అభిషేక్ అగర్వాల్.
రచన: వంశీకృష్ణ నాయుడు, శ్రీకాంత్ వీస్సా (డైలాగ్స్).
సంగీతం: జీవి ప్రకాష్.
చాయాగ్రహణం: మది ఐ ఎస్ సి.

టైగర్ నాగేశ్వరరావు ఓ దొంగ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించడం ఇంతవరకు ఇదే మొదటిసారి. దర్శకుడు వంశీ ఆ పని చేశాడు

కథ:
స్టువర్ట్ పురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు అలియాస్ నాగి (రవితేజ) ఓ గజదొంగ. పోలీసులకు ముందుగా సమాచారం అందించి దొంగతనం చేయడం అతని నైజం. తన గ్యాంగ్ తో కలిపి బ్యాంకు దోపిడీలకు పాల్పడుతుంటాడు. స్థానిక ఎమ్మెల్యే ఎలమంద అతని తమ్ముడు కాశి స్టువర్టుపురం దొంగలపై పెత్తనం చెలాయిస్తుంటారు. ఆ ప్రాంతంలో ఏ దొంగతనం జరిగిన ఎలమందకు కమిషన్ వెళ్లాల్సిందే నాకీ మాత్రం వారిని పట్టించుకోకుండా తన గ్యాంగ్ తో కలిసి దొంగతనాలకు వెళుతుంటాడు ఒకానొక దశలో ఏకంగా దేశ ప్రధానమంత్రి ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేస్తాడు ఆ విషయాన్ని ముందే ప్రధాని భద్రతా సిబ్బందికి తెలియచేస్తాడు. అసలు టైగర్ నాగేశ్వరరావు ప్రధాని ఇంట్లో దొంగతనం చేయడానికి గల కారణం ఏంటి? ప్రధాని ఇంటి నుంచి ఏం దొంగతనం చేశాడు? ఆ దొంగతనం తర్వాత నాకీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఎనిమిదేళ్ల వయసులోనే నాగేశ్వరరావు దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది. దొంగతనం చేసి సంపాదించిన డబ్బంతా ఏం చేశాడు? నాగేశ్వరరావు కాస్త టైగర్ నాగేశ్వరరావు గా ఎలా మారాడు. సీఐ మౌళి తో నాగికి ఉన్న వైరం ఏంటి ఎమ్మెల్యే ఎలమంద అతని తమ్ముడు కాశి చేసే అరాచకాలను నాగి ఎలా తిప్పి కొట్టాడు. ప్రేమించిన అమ్మాయి సార ఎలా చనిపోయింది?నాగి జీవితం పై సంఘసంస్కర్త హేమలత లవణం ప్రభావం ఎలా ఉంది? చివరికి నాగేశ్వరరావు ఎలా చనిపోయాడు అనేది మిగతా కథ.

సినిమా ప్రారంభానికి ముందు ఒక కార్డు వేశారు కొన్ని చరిత్రలు నెత్తుటి సిరాతో రాస్తారు, మరికొన్ని చరిత్రలు కన్నీటి సిరాతో రాస్తారు. ఆ రెండు కలిపి రాసిన చరిత్ర టైగర్ నాగేశ్వరరావు సినిమా మొత్తం చూశాక అదే ఫీలింగ్ కలుగుతుంది. టైగర్ నాగేశ్వరావు ఒక దొంగ పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి దొంగతనం చేసేవాడు అని చాలామందికి తెలుసు. అసలు అతను దొంగతనం ఎందుకు చేయవలసి వచ్చింది. దోచిన డబ్బంతా ఏం చేశాడు? ఎలా చనిపోయాడు చాలా మందికి తెలియదు. ఈ చిత్రంలో అదే చూపించారు. వాస్తవానికి ఇది బయోపిక్ అయిన చాలాచోట్ల సినీమాటిక్ లిబర్టీని తీసుకున్నాడు దర్శకుడు అలాగే అందరిలాగే నాగేశ్వరరావు లో కూడా మంచి చెడు రెండు కోణాలు ఉన్నాయి కానీ దర్శకుడు వంశీ మాత్రం రెండో కోణాన్ని తెరపై చూపించాడు. టైగర్ చేసే ప్రతి దొంగతనం వెనక ఓ మంచి కారణం ఉందనేది చూపించాడు. ఇది ఓ గజదొంగ బయోపిక్ కాబట్టి దొంగతనాలు తప్ప ఇంకేం చూపిస్తాడులే అనుకోవచ్చు. కానీ స్టువర్టుపురం ప్రజలు ఎందుకు దొంగలుగా మారాల్సి వచ్చింది. రాజకీయ నాయకులు, పోలీసులు అధికారులు చేతుల్లో వారి జీవితాలు ఎలా నలిగిపోయాయి అనేది చాలా ఎమోషనల్ గా చూపించారు.

ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్ పుత్ కు స్టువర్టుపురం ఏరియాలో పనిచేసిన పోలీస్ అధికారి విశ్వనాథ్ శాస్త్రి టైగర్ నాగేశ్వరావు గురించి చెప్పే సీన్తో కథ ప్రారంభం అవుతుంది. రాజమండ్రి బ్రిడ్జిపై ట్రైన్ దోపిడీ సీన్ తో హీరో ఎంట్రీ ఉంటుంది ఆ దొంగతనం సీన్ అయితే అదిరిపోతుంది ఆ తరువాత టైగర్ నాగేశ్వరరావు బాల్యం స్టువర్టుపురం దొంగలు గురించి తెలుపుతూ సన్నివేశాలు అల్లారు.సారా తో ప్రేమ ప్రయాణం అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఆమె చనిపోయే సన్నివేశం అయితే ఎమోషనల్ గా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుంది. హీరో జైలు నుండి తప్పించుకుని వచ్చిన తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ గూస్ బూమ్స్ తెప్పిస్తాయి. హేమలత లవణం(రేణు దేశాయ్) ఎంట్రీ తరువాత కథ ఫాస్ట్ గా ముందుకు సాగుతుంది క్లైమాక్స్ కి ముందు రివిల్ చేసే కొన్ని ట్విస్టులు టైగర్ పై మరింత ప్రేమను కలిగించేలా చేస్తాయి ఈ విషయంలో స్క్రీన్ ప్లే మాయ చేశాడు దర్శకుడు.

నటీనటుల విషయానికొస్తే:
టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ ఒదిగిపోయాడు యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్లలోనూ అద్భుతంగా నటించాడు తెరపై కొత్త రవితేజను చూస్తాం అయితే అతన్ని యంగ్ చూపించేందుకు వాడిన గ్రాఫిక్స్ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది టైగర్ ప్రేమించిన అమ్మాయి సారా పాత్రకి నుపుర్ సనన్ మరదలు మని పాత్రకి గాయత్రి భరద్వాజ్ న్యాయం చేశారు. తెరపై వీరిద్దరి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించారు. ఇక ఎమ్మెల్యే ఎలమంద పాత్రలో హరీష్ ఒదిగిపోయాడు ఒక సంఘసంస్కర్త హేమలత లవణం పాత్రకి రేణు దేశాయ్ న్యాయం చేసింది. స్టువర్టుపురం గ్రామవాసి దొంగలకు కోచి ఇచ్చే వ్యక్తి గజ్జల ప్రసాద్ గా నాజర్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే జీవి ప్రకాష్ నేపద్య సంగీతం సినిమాకుప్లస్ అయింది. అయితే పాటలు మాత్రం మామూలుగా సాగుతున్న కథకి ఇబ్బందిగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకా కాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

Leave a Comment