Vishnav Tej Aadikeshava Movie

vishnav tej

వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా నటించిన ఆదికేశవ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. వైష్ణవ్ తేజ్ తొలిసారి మాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తనకు మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఉద్దేశం లేదని తెలిసిందల్లా కష్టపడి నిజాయితీగా పనిచేయటమేనని మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఆది కేశవ సినిమా ప్రమోషన్స్ లో చెప్పారు. ఆది కేశవ సినిమా కథ నచ్చి చేశానని ఫలితం గురించి ఏ రోజు ఆలోచించనని చెప్పారు. తన మొదటి సినిమా ఉప్పెన కూడా కథ నచ్చే చేశానని ముందు నాకు కథ నచ్చితేనే చేస్తాను అని వైష్ణవ్ తేజ్ చెప్పారు.

వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా నటించిన ఆది కేశవ ఈనెల 24న రిలీజ్ కానుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై సూర్యదేవరనాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఆది కేశవ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకునే ఉద్దేశం తనకు లేదని వైష్ణవ్ తేజ్ చెప్పారు. అసలు నువ్వు హీరోవా అని అడిగితే నేను హీరో కాదు నటుడిని అని చెప్తా అన్నారు. తన మామయ్య అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా తనతో విభిన్నమైన కథలు చేసి మంచి నటుడిగా నిరూపించుకోమని చెప్పారని తెలిపారు. దర్శకుడు శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు ఎంత బాగుందో దాన్ని ఎంత అద్భుతంగా ఆయన తెరకెక్కించారని వైష్ణవవ్ తేజ్ తెలిపారు. తనకి డాన్స్ రాకపోయినా చాలా కష్టపడి ఈ సినిమాలో డాన్స్ చేశానని శ్రీ లీల మద్దతుతో పూర్తి న్యాయం చేయగలిగానని వైష్ణవ్ తేజ్ తెలిపారు. సహజ సిద్ధమైన ఫైట్లతో ఉంటుందని, తనకు శ్రీ లీలకు మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్ గా ఉంటాయని సంభాషణలు సరదాగా ఉంటాయని అన్నారు. ఈ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అవుతున్న మలయాళ నటుడు జోజు జార్జ్ చాలా మంచి పర్ఫామెన్స్ చేశారని చెప్పారు.ఆయన భోజన ప్రియుడని ఎప్పుడు ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అని ఆరా తీసేవాడని చెప్పారు.పెద్ద నటుడు జాతీయ పురస్కార గ్రహీత అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉండేవారని తెలిపారు

Leave a Comment